దేశంలో ఉన్న ఇతర బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం కోసం తాజాగా Reliance 'జియోఫైబర్' ఆకర్షణీయమైన ప్రయోజనాలతో కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో అందరినీ బాగా ఆకర్షించిన అంశం Truely Unlimited అనే పదం.
ACT Fibernet, Airtel వంటి అనేక బ్రాడ్బ్యాండ్ సర్వీసులు తాము అందించే ప్లాన్లకి FUP పరిమితి కలిగి ఉన్న నేపథ్యంలో 'జియోఫైబర్' నిజంగా అపరిమితమైన డేటా అందిస్తోందా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 'జియోఫైబర్' అందించే 500 Mbps, 1Gbps ప్లాన్స్‌కి ఎలాంటి డేటా పరిమితులు ఉండవు. అయితే 300 Mbps స్పీడ్ వరకూ కలిగి ఉండే ఇతర ప్లాన్స్ విషయంలో మాత్రం FUP ఉంటుంది. ఒక నెల రోజుల వ్యవధిలో గరిష్టంగా 3.3 TB భారీ పరిమాణం కలిగిన డేటాను వినియోగదారులు తమ ప్లాన్స్ ద్వారా వినియోగించుకోవచ్చు.
కచ్చితంగా 3.3 TB అంటే మన అవసరాలకు మించి లభిస్తుంది. కాబట్టి FUP ఉంది అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. 3.3 TB డేటా వినియోగం పూర్తయిన తర్వాత స్పీడ్ తగ్గించబడుతుంది. మరుసటి నెల మొదటి తేదీన మళ్లీ మునుపటి స్పీడ్ లభిస్తుంది. వాస్తవానికి Airtel Xstream Fiber, Tata Sky broadbandలలో కూడా FUP పరిమితి విధించబడింది. Airtel VIP planని ఎంపిక చేసుకున్న వినియోగదారులకు 1Gbps స్పీడ్ అపరిమితంగా అందించబడుతుంది. అయితే ఇతర ప్లాన్స్ వినియోగించే వినియోగదారులు నెలకు అదనంగా 299 రూపాయలు చెల్లించడం ద్వారా గరిష్టంగా 3.3 TB వరకూ డేటా పొందొచ్చు.
ఏదేమైనప్పటికీ 'జియోఫైబర్' ద్వారా ప్రత్యేకంగా టీవీ ఛానల్స్, ఉచిత వాయిస్ కాల్స్ వంటి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా 'జియోఫైబర్' దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలకు చాలా వేగంగా విస్తరించింది. కాబట్టి రాబోయే కొద్ది కాలంలో బ్రాడ్బ్యాండ్ రంగంలో కూడా 'జియోఫైబర్' తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa