రాంచీ: 174 మందితో రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. రాంచీలోని బిర్సా ముండా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్‌ను పక్షులు ఢీకొట్టాయి. దీంతో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి విమానాన్ని ఆపినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. టర్బైన్‌లోని బ్లేడ్స్ పాడవడంతోపాటు ఇంజిన్‌లో నుంచి పొగలు వచ్చాయి. విమానాన్ని కష్టమ్మీద నిలిపిన తర్వాత ప్యాసెంజర్లను ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దింపారు. ఈ మధ్యే రాంచీలో ల్యాండవుతున్న సమయంలోనే ఇదే ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్యాసెంజర్ ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa