తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ గురువారం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న రథసప్తమి సందర్భంగా 25 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి రోజుకు 5 వేల చొప్పున అదనపు టికెట్లను వెబ్ సైట్ లో ఉంచింది. ప్రస్తుతం నిత్యం 50 వేల మంది వరకు స్వామిని దర్శించుకునేలా ఉచిత టోకెన్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa