ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన ధనుశ్(16), రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన తరుణ్‌కుమార్ రెడ్డి(16),శ్రీహరి (18) కలిసి ద్విచక్ర వాహనంపై గుర్రంకొండ మండలం తరిగొండలో జరుగుతున్న ఓ వివాహానికి బయలుదేరారు. రాత్రి కావడంతో వారి వాహనం ఆరోగ్యవరం వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకులు వేర్వేరు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa