కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే ఆ నిబంధనలేవీ తమకు పట్టవు అన్నట్లుగా కొంత మంది వ్యవహరిస్తున్నారు. తాజాగా నైట్ కర్ఫ్యూ టైమ్ లో ఓ యువతి నడి రోడ్డుపై రచ్చ చేసింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే 25 ఏళ్ల యువతి పాయల్బ అలియాస్ ప్రిషా రాథోడ్ అనే యువతి ఈ రూల్ తనకో లెక్కా అనుకుందో ఏమో కాని ఏప్రిల్ 12న నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో రాజ్‌కోట్ వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్న ఆ యువతి రాజ్‌కోట్‌లోని మహిళా కాలేజీ పక్కన రోడ్డుపై ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కరోనా టైమ్ లో ఈ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల వద్దకు చేరింది. దీంతో ఆమెపై రాజ్‌కోట్ ఏ-డివిజన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలా లేట్ నైట్ వీడియోలను ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుందని పోలీసుల విచారణలో బయటపడింది. వ్యవహారం రచ్చ కావడంతో ఆ యువతి దారికొచ్చింది. ఆ వీడియోను తన ఖాతా నుండి డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కోరింది. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa