కరోనా కట్టడికి యూపీ సర్కార్ మరో కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మాస్కు లేకుండా మొదటి సారి పట్టుబడితే రూ.1000 జరిమానా విధించగా పదేపదే అలాగే కనిపిస్తే రూ.10,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. అలాగే ప్రతి ఆదివారం రాష్ట్రమంతటా లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. ఆ రోజు ఎమర్జెన్సీ సేవలకు ఆంక్షల నుంచి వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa