ఏపీలో 113 టెక్నికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు మరింత పెంచేందుకు సిబ్బందిని పెంచనున్నారు. ఏపీ వ్యాప్తంగా 12 ప్రభుత్వ, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు. తక్కువ సమయంలోనే కరోనా టెస్టు రిపోర్టులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోజుకి 60 వేలకు పైగా టెస్టులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa