జీవితాంతం కలసి ఉండాల్సిన ఆ భార్య భర్తలతో విధి వింత నాటక మాడింది. సాఫీగా సాగిపోతున్న వారి సంసారాన్ని అనుకోని ఘటన ఊహించని మలుపుతిప్పింది. అనారోగ్యంతో కట్టుకున్న భర్త కన్ను మూయటంతో కట్టుకున్న భార్యే చితి మంటలతో సాగనంపాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్ధానికులకు కన్నీరు తెప్పించింది. టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన పొన్నాడ శ్రీనివాసరావు (35)కు అదే గ్రామానికి చెందిన హైమావతితో 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు రైల్వేలో పని చేస్తున్నాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతి చెందాడు. శ్రీనివాసరావుకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవటం, పిల్లలు చిన్నవారు కావటంతో.. చేసేది లేక భార్య హైమావతి తన భర్త చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa