వైయస్సార్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని పైలట్ ప్రాజెక్టు గా పోలాకి మండలం సంత లక్ష్మీ పురంలో ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ...
• ముందుగా కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా నిలుస్తామని మాట ఇస్తున్నాను.
• దేశంలో ఒక వైపు కోవిడ్ ఉధృతంగా ఉన్నపటికి ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాగం.. ముఖ్యంగా సర్వే మరియు రెవెన్యూ శాఖలు ఎంతో శ్రమించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వారందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియ జేయాలనుకుంటున్నాను.
• మీకందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ – సర్వేను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వందేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సర్వే కోసం సర్వే సెటిల్మెంట్, లాండ్ రికార్డ్స్ (SSLR) శాఖలు, సర్వే ఆఫ్ ఇండియా (SOI) వారి సహకారం తీసుకుని కార్యాచరణ చేస్తున్నాయి. వ్యవసాయ భూముల్లోనే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నివాస సముదాయములలో కూడా తొలి సరి సర్వే నిర్వహిస్తున్నాము.
• మంత్రిగా నేను నిర్వహిస్తున్న రెవెన్యూ, సర్వే శాఖలతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డవలప్ మెంట్, పంచాయితీ రాజ్ శాఖలు కూడా ఇందులో కలసికట్టుగా భాగస్వాములుగా పనిచేస్తున్నాయి.
• ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది డిసెంబర్ 21 వ తేదీన ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా టెక్కలి పాడులో ప్రారంభించారు. వారి సూచనల ప్రకారం నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా మెదటి దశలో : 5353 గ్రామాలలో జనవరి 2021 నుంచి జులై 2021 వరకూ రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రస్తుతం జరుగుతుంది. తొలిదశ త్వరలోనే పూర్తి కానుంది.రెండవ దశలో : 5911 గ్రామాలలో జులై 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకూ..అలాగే మూడవ దశలో 6187 గ్రామాలలో మార్చి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకూ సర్వేను పూర్తిచేసి తీరుతాం.పైలెట్ ప్రాజెక్టు క్రింద ఇప్పటికే క్రిష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలము తక్కెళ్ళపాడు, రామచంద్రునిపేట గ్రామములో రీ-సర్వే పూర్తి చేసి సంబంధిత రైతులకు హక్కు పత్రములు కూడా అందజేసాము.ఆ గ్రామములో ఉన్న గ్రామ సచివాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము.
• రాష్ట్రం మొత్తం మీద 51 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 51 గ్రామాలు ప్రస్తుతం ఎంపిక చేసి ఆ గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమాన్ని ఈ ఆగష్టు 15, 2021 నాటికి పూర్తి పూర్తి చేయనున్నాము.
• మలివిడతలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రాష్ట్రం మొత్తం మీద 679 గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. .ఇలా రాష్ర్టం మొత్తం మీద 3 విడతలలో అక్టోబర్ 2022 నాటికి ఈ రీ-సర్వే కార్యక్రమము 17,461 గ్రామములలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాము.
• ఈ రీ-సర్వే నిర్వాహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 987 కోట్ల బడ్జెట్ లో కేటాయించింది.
. • ఈ రీ-సర్వే కార్యక్రమ నిర్వాహణలో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సర్వే మరియు బౌండరీ చట్టము, 1923 నకు కొన్ని సవరణలు చేయడం కూడా జరిగింది..
• స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ (SOP) ప్రామాణిక ఆపరేటింగ్ విధానంలో సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రీ-సర్వే నిర్వహించడం జరుగుతుంది. • గ్రామ సర్వేయర్లకు ఇతర సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం కూడా పూర్తయింది.• అన్ని వనరులను సమకూర్చుకొని ప్రతి భూస్వామికి నిశ్చయాత్మకమైన భూమి శీర్షిక (LAND TITLE) అంటే భూ హక్కు పత్రము ఇవ్వడం ద్వారా ప్రతి భూ హక్కుదారునికి ఈ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది.
• ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని, బాధ్యతలను మాకు అప్పగించినందుకు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మొహన్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశంలోనే ఒక గొప్ప చరిత్ర సృష్టించిన ఇలాంటి కార్యక్రమంలో మంత్రి గా నాకు భాగస్వామ్యం కల్పించిన సీఎం జగన్ గారికి జన్మ జన్మల రుణపడి ఉంటాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa