ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మరియు తెలంగాణ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 09, 2021, 02:18 PM

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలో 12, ఎపి లో 11 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16 న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24 న నామినేషన్ల పరిశీలన, 26 న ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10 న పోలింగ్‌ నిర్వహించి 14 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa