ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 09, 2021, 02:34 PM

ప్రైవేట్​రంగ బ్యాంకింగ్​ దిగ్గజం కోటక్​ మహీంద్రా బ్యాంక్​ గృహ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. దసరా, దీపావళి పండుగ సమయంలో మార్కెట్​లోనే అతి తక్కువ వడ్డీకే గృహరుణాలు ఆఫర్​ చేసిన కోటక్​ మహీంద్రా..పండుగ సీజన్​ ముగియడంతో ఇప్పుడు వడ్డీ రేట్లు (Interest Rates) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు 5 బేసిస్​ పాయింట్లు అంటే 0.05 శాతం మేర పెంచింది. దీంతో ఇప్పుడు బ్యాంక్​లో గృహ రుణ వడ్డీ రేట్లు 6.55 శాతం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 10 వరకు చెల్లుబాటులో ఉంటాయని కోటక్​ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)​ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త గృహ రుణాలతో పాటు లోన్​ ట్రాన్స్​ఫర్​ అకౌంట్లకు సైతం ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.


దసరా, దీపావళి పండుగ సీజన్​ సందర్భంగా కస్టమర్లను ప్రోత్సహించేందుకు కేవలం 6.5 శాతం వడ్డీకే కోటక్ మహీంద్రా గృహరుణాలను మంజూరు చేసింది. దాదాపు 60 రోజుల పాటు ఈ ఆఫర్​ను అందుబాటులో ఉంచింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్​ వచ్చింది. ఎంతో మంది కొత్త రుణాలు తీసుకోవడంతో పాటు ఇతర బ్యాంకుల నుంచి ఈ బ్యాంకులోకి రుణాలను ట్రాన్స్​ఫర్​ చేసుకున్నారు. నవంబర్​ 8తో ఈ ఆఫర్​ ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్​ 9 నుంచి డిసెంబర్​ 10 వరకు కొత్త వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయని చెప్పారు కోటక్​ మహీంద్రా బ్యాంక్​ ప్రెసిడెంట్​ కన్స్యూమర్ అసెట్స్​ ప్రెసిడెంట్ అంబుజ్​ చందనా.


 


''ఈ సమయంలో గృహరుణాలపై 6.55 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే నవంబర్ 8 నాటికి ఆమోదం పొందిన గృహ రుణ అప్లికేషన్ల విషయంలో చిన్న వెసులుబాటు కల్పిస్తున్నాం. తదుపరి ఏడు రోజుల్లో.. అంటే నవంబర్ 15లోపు లోన్​ అమౌంట్​ ట్రాన్స్​ఫర్​ అయితే పాత వడ్డీరేటు 6.5 శాతం అమల్లో ఉంటుంది" అని బ్యాంక్ పేర్కొంది.


 


5 బేసిస్​ పాయింట్ల వడ్డీ పెంపు..


కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త వడ్డీ రేటు బ్యాలెన్స్​ ట్రాన్స్​ఫర్​ రుణాలపై కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ వడ్డీరేటు కింద ప్రిన్సిపల్​ అమౌంట్​పై ఎటువంటి పరిమితి లేకపోవడం విశేషం. ఈ గృహరుణాలు నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులకు అందుబాటులో ఉంటుంది. 6.5 శాతం వడ్డీ అనేది కనీస వడ్డీ రేటు. గరిష్ట వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్​ స్కోర్​పై ఆధారపడి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa