యెమెన్: యెమెన్ రాజధాని సానా సమీపంలో సౌదీ నేతృత్వంలో సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది మృతి చెందారు. సానా శివారు ప్రాంతంలో అర్హ పట్టణంలోని ఓ హోటల్‌పై ఈ దాడులు జరగ్గా.. మృతదేహాలు వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతి రెబల్స్ ఉన్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిగాయి. 2015 సంవత్సరం నుంచి సానా నగరం రెబల్స్ అధీనంలో ఉంది. ఈ దాడుల్లో గాయపడిన మరో 15 మందికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa