ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2017, 10:11 AM

హనుమంతునిపాడు: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని మహమ్మద్‌పురం గ్రామం వద్ద చోటుచేసుకుంది. కడప నుంచి విజయవాడ వెళ్తున్న మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సు బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మహమ్మద్‌పురం వచ్చేసరికి ఇంజిన్‌లో పొగలు వచ్చాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ బయటకు దింపేశాడు. కొద్దిసేపటికే బస్సంతా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేసరికే బస్సు మొత్తం కాలిపోయింది.ప్రమాదంలో తమ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు దగ్ధమయ్యాయని పలువురు ప్రయాణికులు వాపోయారు. ఈ ఘటనపై హనుమంతునిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa