గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద బ్యాగ్‌లో ఉంచిన 24 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వట్టిచెరుకూరు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కృష్ణానదిలో స్నానానికి వెళుతూ ఒడ్డున బ్యాగ్‌లో 24 సెల్‌ఫోన్లు ఉంచారు. స్నానం తర్వాత ఒడ్డుకు చేరుకుని చూసేసరికి ఆ బ్యాగ్ కనిపించలేదు. అనంతరం విద్యార్థులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ. 3లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు. కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa