తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం నలూర్ నుంచి వెల్లింగ్టన్ కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. ఈ ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై పార్లమెంట్ లో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa