ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ తో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 03:52 PM

భారతప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 50 అసిస్టెంట్‌ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.


*పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు(గ్రూప్-ఎ గెజిటెడ్‌ అఫీసర్‌)


జనరల్‌ డ్యూటీ(మేల్‌): 30


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత.


వయసు: 1997 జూలై 01 నుంచి 2021 జూన్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.


*కమర్షియల్‌ పైలెట్‌ ఎంట్రీ(సీపీఎల్‌-ఎస్ఎస్ఏ)(మేల్‌/ఫిమేల్‌): 10


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీచేసిన వ్యాలిడ్‌ కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉండాలి.


వయసు: 1997 జూలై 01 నుంచి 2021 జూన్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.


*టెక్నికల్‌(ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)(మేల్‌): 10


*అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


*వయసు: 1997 జూలై 01 నుంచి 2021 జూన్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.


*ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా


*దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 06, 2021


*దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 17, 2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.joinindiancoastguard.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa