ఏపీ లోని చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు: ఫార్మసిస్ట్ గ్రేడ్-2
అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్ ఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.
వయస్సు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, కోర్సు వెయిటేజ్, సర్వీస్ వెయిటేజ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబరు 21
చిరునామా: డీఎంహెచ్‌ఓ, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa