బ్రిటన్ నుంచి కొచ్చికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌కు సంబంధించిన ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం ప్రకటించారు.ప్రయాణీకుడు డిసెంబర్ 6 న కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ తరువాత డిసెంబర్ 8 న అతను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అతని నమూనాలను న్యూఢిల్లీతో పాటు తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ బయోటెక్నాలజీ సెంటర్‌కు పంపగా, ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa