రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో సుమారు 10 కిలోమీటర్ల సమీపంలో ఉన్న సిద్దలయ్యకోన జలపాతం తిలకించేందుకు గూడూరు చౌట పాలెం కు చెందిన 5 మంది యువకులు ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జలపాతం వద్దకు చేరుకొని జలపాతం లో కొద్దిసేపు జలకాలాడారు.అసలే అటవీ ప్రాంతం చీకటి కావటంతో 5 మంది స్నేహితులు తిరుగు ప్రయాణమయ్యారు. జలపాతం నుండి కొంత దూరం వచ్చిన తర్వాత వెనుకబడిన కిషోర్ కనిపించకపోవడంతో మిగిలిన నలుగురు స్నేహితులు ఆ ప్రాంతమంతా గాలించారు.కిషోర్ జాడ కనిపించక పోవడంతో రాపూరు పోలీసులకు రాత్రి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కలిసి కిషోర్ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa