దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 19 నుంచి 23 వరకు జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు విరాట్ దూరం అవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ కోసం జట్టును ఎంపిక చేసినప్పుడు భారత సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి సారథ్యం వహిస్తుండగా.. గాయం కారణంగా రోహిత్ ఈ టెస్ట్ మ్యాచ్ లు ఆడటం లేదు. ఆ తర్వాత జనవరి 19 నుంచి జరిగే వన్డేలకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ లకు కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో తన పాప మొదటి పుట్టినరోజు ఉండడంతో ఆ సమయంలో వన్డేలకు ఆడలేనని విరాట్ ఇప్పటికే బిసిసిఐ అధికారులకు తెలిపాడు. కారణాలు ఏదైనాకానీ విరిద్దరూ ఒకరి సారథ్యంలో మరొకరు ప్రస్తుతానికి ఆడటం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa