సినిమాను తలపించేలా తల్లిని కాదని ప్రియుడితో వెళ్లిపోయింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడు కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలో జరిగింది. కరవిలగం ప్రాంతానికి చెందిన సజిన్ (25), కరంగల్ ప్రాంతానికి చెందిన డిగ్రీ సెకండియర్ చదువుతున్న అబిషా (21) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఇంట్లో నుండి పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు పోలీసులు. చదువు పూర్తయిన తర్వాత ప్రియుడి ఇంటికి వెళ్లాలని తల్లి, పోలీసులు ఆ యువతికి సలహా ఇచ్చారు. కానీ ఆమె మాత్రం తన మెడలో ఉన్న నగలు తీసి తల్లి చేతిలో పెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa