ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 77 దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డబ్ల్యూ హెచ్ వో సైతం ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేసింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ పై ఫైజర్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. కోవిడ్-19 చికిత్స కోసం తాము ప్రయోగాత్మకంగా రూపొందించిన యాంటీవైరల్ మాత్ర కరోనాలోని ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఆ కంపెనీ వెల్లడించింది. 2,250 మందిపై అధ్యయనం నిర్వహించగా అందులో సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa