బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (సీవర్‌మ్యాన్)- 2, కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) - 24, కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) - 28, కానిస్టేబుల్ (లైన్‌మన్) - 11, ఏఎస్‌ఐ-1, హెచ్‌సీ-6.
అర్హతలు:
అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతాలు:
- కానిస్టేబుల్ (సీవర్‌మ్యాన్), కానిస్టేబుల్(జనరేటర్ ఆపరేటర్), కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్), కానిస్టేబుల్ (లైన్‌మన్) పోస్టులకు రూ.21700 నుంచి రూ.69100
- ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300
- హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించాలి.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఇవన్నీ ఉత్తీర్ణత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ లింక్: https://rectt.bsf.gov.in/static/bsf/pdf/BSF%20Group-C%20Engineers%20Recruitment.pdf
దరఖాస్తు లింక్: https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=3d4da058-cf5b-12eb-bafc-fc017s9a1ba
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 29, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa