కర్నూలు: కర్నూలు నగరంలో గణేశ్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. నగరంలోని కేసీ కెనాల్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక్ ఘాట్‌కు బొజ్జ గణపయ్యలు తరలివెళ్తన్నారు. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య నగరంలోని 4 ప్రాంతాల నుంచి గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఇంకా కొనసాగుతోంది. తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన గణేశుడిని వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా జరుగుతోంది. కేసీ కెనాల్ వద్ద మొత్తం 6 చోట్ల భారీ క్రేన్లను ఏర్పాటుచేశారు. 11 ఘాట్‌లలో పెద్ద పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఘాట్‌లో మొత్తం 1800 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన వేడుకలు ఈ మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు కలెక్టర్ కూడా ఇప్పటికే ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మూడుసార్లు బక్రీద్, వినాయక నిమజ్జనం ఒకేసారి వచ్చినప్పటికీ కర్నూలు నగర ప్రజలు హిందూ, ముస్లిం భాయీ భాయీ అంటూ శాంతి, సామరస్యతకు చిహ్నంగా నిలుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa