ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ హై-స్పీడ్ ఈ-స్కూటర్ మార్కెట్లో విడుదల చేసింది. ఫాస్ట్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.89,999 గా కంపెనీ ప్రకటించింది. ఒకాయ ఎలక్ట్రిక్ వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల వద్ద రూ.1999 చె ల్లించి స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 150-200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 4.4 కిలోవాట్. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ తో పాటు అత్యాధునిక ఫీచర్లను జోడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి దీనిని మార్కెట్లోకి తేనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa