భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా ప్రాణాలు కొల్పోయాడు. బార్మర్ లో శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. వైమానిక దళానికి చెందిన విమానాల ప్రమాదాలు కొత్తేమీ కాకపోయినా తాజా ఘటన పాక్ బార్డర్ సమీపంలో చోటు చేసుకోవడంతో అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa