ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నా బ్యాంకు ఉద్యోగి

national |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 12:06 AM

తమిళనాడులో  బ్యాంకు ఉద్యోగి భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.మణికందన్ తన భార్య తారా (35), ఇద్దరు కుమారులు తరణ్ (10), దహన్ (1)లతో కలిసి చెన్నై సమీపంలోని పెరుంగుడిలో నివసిస్తున్నాడు. పోరూర్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న మణికందన్‌కు చాలా అప్పులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. 2 నెలలుగా ఉద్యోగానికి వెళ్లడం లేదని, ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. డిసెంబర్ 31న  పెద్ద గొడవ జరిగిందని, ఆ కోపంతో భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.తోరైపాక్కం పోలీసులు సంఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa