మంగళూరు నుంచి కాచిగూడ వెళ్తున్న రైలుకు కర్నూలు జిల్లా వెల్దుర్తి అయ్యప్పస్వామి గుడి వద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికుల బోగీల్లోంచి ఇంజన్ ఊడిపోయింది. అంత దూరం వెళ్లాక ఇంజిన్ ఆగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో మరో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇంజిన్ ఊడిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa