ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకి రూ.40 వేల జీతంతో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jan 06, 2022, 04:03 PM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) కాంట్రాక్టు ప్రాతిపదికన 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 19


ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 15, ప్రాజెక్ట్ అసోసియేట్లు(క్లౌడ్ సపోర్ట్) 4 పోస్టులున్నాయి.


- ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం నెలకి రూ.40 వేలు చెల్లిస్తారు.


- ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం నెలకి రూ.34 వేలు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 18, 2022.


నోటిఫికేషన్ : https://www.cdac.in/index.aspx?id=ca_recrutiment_3012021


వెబ్ సైట్: https://www.cdac.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa