ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది అమ్మఒడి అమలు చేయకుండా సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారు: జీవీ ఆంజనేయులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 11:58 AM

ప్రతి ఏడాది జనవరి 26న ఇచ్చే అమ్మఒడిని ఈ ఏడాది అమలు చేయకుండా సీఎం జగన్‌ నమ్మకద్రోహం చేశారని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. సోమవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలనలో ఐదేళ్లూ ఈ లబ్ధి అందిస్తామన్న జగన్‌రెడ్డి హామీ ఇచ్చి ఈ ఏడాది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలోనూ అమ్మఒడిని అమలు చేశామని చెప్పుకొంటున్న వైసీపీ నేతలు నేడు అమ్మఒడి వర్తింపునకు 75శాతం విద్యార్థుల హాజరును బూచిగా చూపించడం సిగ్గుచేటన్నారు. అమ్మఒడిని ఇప్పటివరకు జనవరిలో ఇస్తున్నామని వచ్చే ఏడాది నుంచి అలాకాకుండా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇస్తామని ప్రకటించారని దానిని బట్టి చూస్తే 2021-22 జనవరిలో రావాల్సిన నిధులు 2022-23 జూన్‌ ఇస్తామని చెప్పినట్లేగా అంటూ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa