ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆవాసమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 12:11 PM

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండల తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో జామి గ్రామానికి చెందిన ఇద్దరు దళిత మహిళలలు సుమారు గత రెండు సంవత్సరాల నుండి కార్యాలయ ఆవరణాన్ని తన ఆవాసంగా మార్చుకున్న సంఘటన చోటు చేసుకుంది. దీని విషయమై తాసిల్దార్ నీలకంఠరావు మాట్లాడుతూ.
తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో జామి గ్రామానికి చెందిన ఇద్దరు దళిత మహిళలలు కార్యాలయ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించి నివాసముండడంతో పాటుగా నిత్యం తనకు, తన సిబ్బంది విధులను ఆటంక పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాసిల్దార్ కార్యాలయం ఆవరణాన్ని వంటసాలగా చేసి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిబ్బంది విధులను ఆటంక పరచడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఆవాసం ఉండకూడదని వారికి నచ్చ చెప్పినప్పటికీ మహిళలు బేఖాతరు చేస్తున్నారని ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు.
వారికి డిమాండ్స్ ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకోవాలని కోరారు. వారి డిమాండ్స్ ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీరి విషయమై తాసిల్దార్ జామి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని విచారిస్తున్న నేపథ్యంలో దళిత మహిళలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో చట్ట వ్యతిరేకంగా నివాసముంటున్న మహిళలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తాసిల్దార్ తెలిపారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు శుక్రవారం తాసిల్దార్ నీలకంఠరావును కలసి మాట్లాడారు.
ఈ సందర్భంగా గౌరి నాయుడు మాట్లాడుతూ. మండలానికి మెజిస్ట్రేట్ అయిన తాసిల్దార్ లాంటి వ్యక్తులకు రక్షణ కరువవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా డిఎస్పి దృష్టిలో పెట్టబోతున్నట్లు జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa