ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ వలయంతో విజయవాడ రహదారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:55 AM

పీఆర్సీ రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు గురువారం చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు వైపు నుండి విజయవాడకు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు తనిఖీల నేపథ్యంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సాధారణ పనులు నిమిత్తం, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa