మహారాష్ట్ర రాజధాని ముంబైలో దుండగులు రెచ్చిపోయారు. ఓ కార్యాలయంలోకి చొరబడి గన్ తో బెదిరించి రూ.కోటి దోచుకెళ్లారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa