ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటం సఫలం కావాలి: ఏపీసీసీ చీఫ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 12:37 PM

రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటం సఫలం కావాలని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. మాయ మాటలతో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల ముందస్తు అరెస్ట్‌లు దుర్మార్గమన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హమీలను ఉద్యోగులు ప్రశ్నించడమే తప్పా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa