ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపులకు మేలు చేసింది జగన్ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 12:38 PM

కాపు ఓట్లతో 2014లో గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు ఆ సామాజిక వర్గాన్ని రోడ్డున పడేశారు. వైఎస్‌ జగన్‌ కాపులకు వెన్నుదన్నుగా నిలిచి వారి సంక్షేమానికి పాటుపడుతున్న విషయాన్ని కాపు జాతి మర్చిపోదు. ఐదుగురు కాపులను మంత్రులను చేయడమే కాకుండా.. 50 మందికిపైగా కాపులను కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అప్పట్లో తునిలో బహిరంగ సభకు పిలుపునిస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు పత్తాలేకుండా పోయారు. వైఎస్‌ జగన్‌ ఒక్కరే నాటి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు కేసులను మాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకున్నారు అని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa