కాపు ఉద్యమ సమయంలో కాపు నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. కాపులకు వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సీఎంకు కాపు జాతి రుణపడి ఉంటుంది. టీడీపీ పాలకులు కాపులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించి చిత్రహింసలకు గురిచేశారు. కాకినాడ ఎస్‌ఈజెడ్ రైతులను కూడా ఇదే రీతిలో అవమానాలకు గురిచేసారు. వారిపై అన్యాయంగా కేసులు బనాయించి జైలులో పెట్టించడమే కాకుండా.. చివరకు బాత్‌రూమ్‌లను కూడా రైతులతో కడిగించిన ఘనత చంద్రబాబుదే. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధించి, అవమానాలకు గురిచేశారు. మహిళలపై తప్పుడు కేసులు బనాయించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కాపులపై అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటప్రకారం 2020లోనే 163 కేసులు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా మరో 161 కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేశారు. తుని రైలు ధ్వంసం కేసులు కూడా ఎత్తివేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. కొద్దిరోజుల్లోనే అవి కూడా ఎత్తివేసేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకినాడ ఎస్‌ఈజెడ్ రైతులపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బనాయించిన కేసులను ఉపసంహరించాలన్న మా అభ్యర్థనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈమేరకు జీవో రానుంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa