ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకైనా నేను రెడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 01:01 PM

హిందూపురం జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. హిందూపురంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి హడావుడిగా జిల్లాలు ప్రకటిస్తూ జీవోను జారీ చేశారని, హిందూపురం జిల్లా కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలకృష్ణ అన్నారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధం అని అన్నారు. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెడితే టీడీపీ సర్కార్ కొనసాగించిందని బాలకృష్ణ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa