కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టిన సచివాలయంలో రిజిస్ట్రేషన్ వల్ల క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం లోని షేర్ మహమ్మద్ పేట సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆర్భాటంగా సచివాలయ సిబ్బందికి కనీస శిక్షణ కూడా లేకుండా, సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్ వినియోగించే కంప్యూటర్, ఇతర పరికరాలు అందించకుండా అట్టహాసంగా ప్రారంభించి చేతులు దులుపుకుంది. అయితే గ్రామానికి చెందిన ఓ యువకుడు విదేశాల నుండి వచ్చి తాను క్రయం పొందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోని తిరిగి విదేశాలకు వెళ్లాలని జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం లో సంప్రదించగా వారు సచివాలయంలోనే చేయించుకోవాలని తెలిపారు. అక్కడ నుండి సచివాలయానికి వెళ్లినా యువకుడికి ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నిమిత్తం వెబ్ లాండ్ ఓపెన్ అవటం లేదని రేపు రావాలని తెలిపారు. మరుసటి రోజు కూడా సచివాలయంలో అదే సమాధానం, ఇలా మూడు రోజులు జరిగిన తర్వాత సదరు యువకుడు జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ వారిని సంప్రదించగా షేర్ మహమ్మద్ పేట కు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేయడానికి వీలు లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, తామేమీ చేయలేమని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా సచివాలయంలో రిజిస్ట్రేషన్లపై అక్కడ సిబ్బందికి కనీస శిక్షణ పరిజ్ఞానం కూడా లేదన్నట్టు వినియోగదారులకు సైతం తెలుస్తున్న విషయం. ఇలా మూడు రోజుల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగి *విసిగిపోయిన విక్రయదారుడు దీనిపై పరిష్కారం కోసం జిల్లా రిజిస్టర్ వారిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా వారు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని, అనవసరంగా ఆంధ్ర ప్రాంతంలో భూమిని కొన్నానని, తెలంగాణ లో కోన్నట్లయితే తనకు ఈ ఇబ్బంది తప్పేదని, అన్నారు. కొన్ని ప్రాంతాలలో సచివాలయాల లో రిజిస్ట్రేషన్లలో ఇబ్బంది తలెత్తితే సమీప రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని, జగ్గయ్యపేట మాత్రం ప్రత్యేకంగా అలాంటి అవకాశం లేదని చెప్పడం వల్ల ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే అంశానికి అధికారులు తూట్లు పొడుస్తున్నట్లు ఉందని, దీనిపై అధికారులు స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విక్రయదారుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa