ప్రభుత్వ ఉద్యోగులతో శాంతియుత వాతావరణంలో చర్చించి సమస్య పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వానికి జనసేన నేత నాగబాబు సూచించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ...."ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగులు ఎంతటి చిన్నవారైనా కావొచ్చు... కానీ జీతాల్లో పెరుగుదల, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు అనేవి ఆ వేతన జీవులకు చిరు ఆశాకిరణాల వంటివి. మా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పినట్టు... ఆ చిన్న ఆశలను కూడా ఉద్యోగులకు అందకుండా చేయడం, ఉన్న జీతాలను తగ్గించడం అనేది గుండెను పిండేస్తోంది. ఈ నేపథ్యంలో నేను కోరేది ఏంటంటే... ఉద్యోగులతో శాంతియుత చర్చలకు ఏపీ సీఎం జగన్ చొరవ చూపాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి" అంటూ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa