ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ...ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడం లేదని శాసనసభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో ఇళ్ల ప్రగతిపై డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 5 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెనాలి, వేమూరు, పొన్నూరు ఎమ్మెల్యేలు మంత్రి ఎదుట అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు సహకరించడం లేదని వాపోయారు. గ్రౌండింగ్ పనులు చేపట్టాలన్నా ఇసుక కొరత ఉందన్నారు. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం కష్టమని వాపోయారు. జోక్యం చేసుకున్న మంత్రి ...ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. త్వరలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని బుజ్జగించారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa