ఉద్యోగులు న్యాయపరమైన హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉంటే సీఎం జగన్ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందని, ఆ హక్కుల సాధన కోసం ఆందోళన చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఉద్యోగుల ఆందోళన చూస్తే పాలకులపై ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa