జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపూర్‌లో సోమవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.ఈ ప్రాంతంలో మరో ఉగ్రవాది దాక్కున్నట్లు భావిస్తున్నందున భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.అవంతిపూర్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.మరోవైపు గందర్‌బల్ జిల్లాలోని సశాస్త్ర సీమా బల్ బంకర్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. గ్రెనేడ్ దాడిలో ఎలాంటి నష్టం జరగకుండా బాంబు పేలడంతో ఎవరికీ గాయాలు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa