ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింగ్ కోబ్రాను క్ష‌ణాల్లో ప‌ట్టేసిన మ‌హిళా ఉద్యోగి

national |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 12:55 PM

ఓ మ‌హిళ నాగుపామును చాక‌చక్యంగా ప‌ట్టేసింది. కింగ్ కోబ్రాను క్ష‌ణాల్లో ప‌ట్టేసిన ఆమెపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కేర‌ళ‌ రాష్ట్రం తిరువ‌నంత‌పురం జిల్లా క‌ట్ట‌క్క‌డ గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపామును స్థానికులు గుర్తించారు. అనంత‌రం అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో అట‌వీశాఖ‌కు చెందిన రోషిణి అనే మ‌హిళా ఉద్యోగి త‌న బృందంతో అక్క‌డికి చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న కింగ్ కోబ్రాను రోషిణి క్ష‌ణాల్లోనే పట్టుకున్నారు. అనంత‌రం ఆ పామును సమీప అడ‌వుల్లో వ‌దిలేశారు. రోషిణి పామును ప‌ట్టిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుధా రామేన్ త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa