జగనన్న సంపూర్ణ గృహ హక్కు చట్టం ఓ టి ఎస్ పథకంపై మున్సిపాలిటీలోని 17 సచివాలయ పరిధిలోని సిబ్బందితో పాటు హౌసింగ్, మున్సిపల్ సిబ్బంది కి ఒకరోజు శిక్షణా కార్యక్రమం పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ డాక్టర్. ఎన్. రాధ పాల్గొని మాట్లాడుతూ సచివాలయంలోని హౌసింగ్ సిబ్బందితో వీఆర్వోలు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఓ టి ఎస్ పత్రాలను పూర్తి నగదు చెల్లించిన లబ్ధిదారులకు తప్పులు లేకుండా పత్రం అందించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. తాసిల్దార్ రత్నం మాట్లాడుతూ ఓటీఎస్ పథకాన్ని నూరు శాతం అమలయ్యేలా సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఓ టి ఎస్ పథకంలో నగదు చెల్లించిన లబ్ధిదారుల పేర్లను ఎప్పటికప్పుడు కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి ఈ శ్రీనివాస్ తో పాటు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa