అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ నరసింహప్ప (54) తెల్లవారుజామున గుండెపోటు తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లేపాక్షి సబ్జెస్టేషన్లో విధులు నిర్వహిస్తూ హిందూపురం విద్యానగర్లో నివాసముంటున్నాడు. తన ఇంటిలోనే ఉదయం 5 గంటల సమయంలో ఉన్నపళంగా గుండెనొప్పి రావడంతో మృతిచెందాడన్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని తోటి సిబ్బంది కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa