ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్య మిత్రలే కీలకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 12:58 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ కార్యక్రమం అమలులో ఆరోగ్య మిత్రలే కీలకం అని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో వాడరేవు వినయ్ చంద్ పేర్కొన్నారు. ఆరోగ్య మిత్రలు ఎలా మసలుకోవాలో వివరిస్తూ 'మీ' చిరునవ్వే రోగులకు ప్రథమ చికిత్స కావాలన్నారు. వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అన్నా, అపరేషన్లు అన్నా సహజంగా ఉండే ఆందోళనను పోగొట్టాలన్నారు.


చికిత్స పొందిన వారికి నగదు అందించే ఆరోగ్య అసరా పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత సైతం ఆరోగ్య మిత్రలు తీసుకోవాలన్నారు. చికిత్సకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆపరేషన్ తర్వాత ఆసరా అందించడానికి అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పని చేయకపోతే కుటుంబం గడిచేదెలా అనే ఆందోళన ప్రజలకు కలగక కూడదనే ఉద్దేశ్యంతో ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మానవతా దృక్పథంతో చేపడుతున్న ఇంతటి గొప్ప కార్యక్రమంపై అవగాహన లేమిని తొలగించాలన్నారు. అదే సమయంలో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే లోపు డబ్బులు ఆసరా డబ్బులు అందేలా చూడాలన్నారు.


జెడ్పీ కార్యాలయంలోని డీపిఆర్సీ భవనంలో నిర్వహించిన ఆరోగ్య మిత్ర శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో వినయ్ చంద్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఏ. సిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa