బెంగళూరు: నాలుగో వన్డేలోనూ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారుతుందన్న అంచనాల మధ్య స్మిత్ మరో ఆలోచన లేకుండా ముందు బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌కు మూడు మార్పులతో బరిలోకి దిగింది ఇండియా. భువనేశ్వర్, బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. వాళ్ల స్థానంలో షమి, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ టీమ్‌లోకి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa