సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది. లాయర్లు చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నారు. ముగ్గురు నిందితులను విజయవాడ తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa