ఢిల్లీ అజాద్‌పూర్ మెట్రో స్టేషన్‌లో కొంత మంది యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యువకుల మధ్య కొట్లాటను నిలువరించేందుకు.. విధులో ఉన్న సీఐఎస్‌ఎఫ్ పోలీసు ఒకసారి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఓ యువకుడు, మరో మహిళ పోలీసుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరో రెండు సార్లు పోలీసు గాల్లోకి కాల్పులు జరిపాడు. గొడవకు దిగిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa