రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావంతో పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌కు రూ.20, లీటరు డీజిల్‌కు రూ.15 ఒక్కసారిగా పెంచాయి. ఈ పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.204 కు చేరగా, లీటరు డీజిల్ ధర ధర రూ.139 కి చేరింది. అసలే ఆకలి సంక్షోభంలో మగ్గుతున్న శ్రీలంకలో తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం అక్కడి ప్రజలను మరింత కుంగదీస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa